Thursday, December 1, 2022
HomeMovie Updatesఎప్రిల్ 8న వరుణ్ తేజ్ 'గని'

ఎప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ,  రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ క‌లిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇటీవ‌లె విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.  

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments