ఇలియానా అనగానే ముందుగా మనకు గుర్తువచ్చేది ఆమె నడుము అందాలు. ఇక ఒక టైమ్ లో ఈ భామకి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పోకిరి సినిమా టైమ్‌లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేది..ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటింది.
ఆ తరువాత నెమ్మదిగా బాలీవుడ్లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియా వేదికగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోస్‌ని షేర్ చేస్తూ నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. స్కైబ్లూకలర్ బికినీలో పరువాల విందుతో పిచ్చెక్కిస్తోంది.
ప్రస్తుతం సినిమాలేమీ లేకపోవడంతో ఇలా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ భామ. బికినీతో రెచ్చగొడుతూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది.ఆ మధ్య కాలంలో కాస్త మానసిక ఒత్తిడి వల్ల కొంత లావయినప్పటికీ తిరిగి తన శరీరాకృతిని మళ్ళీ సన్నగా నాజూకుగా తయారు చేసుకుంది. అయితే మునుపటి అందం మాత్రం తన ముఖంలో కనపడడం లేదు. కొంత వరకు ఛార్మింగ్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం ఇలియానా నటించిన బిగ్బుల్ చిత్రం ఓటీటీలో విడుదలయింది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నటించగా ఇది మంచి పాజిటివ్ టాక్ని అందుకుంది.